ఉచిత చలివేంద్రం ఏర్పాటు..

ఆంధ్రప్రభ, జగదేవపూర్ : సమాజానికి సేవ చేసే అవకాశం కలగడం దేవుడు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నానని ఇమ్మడి శివలక్ష్మి జాంగిర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆమె ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు ఆంక్ష రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇమ్మడి శివలక్ష్మి జాంగిర్ మాట్లాడుతూ, దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకు సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. సమాజ సేవ చేసే అవకాశం అందరికీ దక్కదని, అలాంటి అవకాశం తనకు లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజల సేవ కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కొండపోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ మచ్చ గణేష్, గ్రామ మాజీ సర్పంచ్ బంగ్లా శ్రీనివాస్ రెడ్డి, బుద్ధ నాగరాజు, డప్పు సాయి, దయాకర్ రెడ్డి, నరసింహులు, రాచకొండ మహేష్, సిద్ధిరాల సూరిబాబు, పేర్ల వెంకటేష్, కొత్త మధుసూదన్ రెడ్డి, అమర రాము, ఆంజనేయులు గౌడ్, ఎండి అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply