ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికై ప్రజాదర్బార్..

  • ప్రభుత్వ వీప్, శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య

వీరులపాడు, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికై ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ వీప్, శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. శుక్రవారం వీరులపాడు మండలం వీ అన్నవరం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సౌమ్య మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సాహించేది లేదన్నారు. ప్రతి గ్రామం లో ప్రజలు ఎదుర్కొనే సమస్య లను గుర్తించి వాటినీ సత్వరం పరిష్కరించాలన్నారు. ముఖ్యం గా ప్రతి పల్లెలో ఏయే సమస్యలు నెలకొన్నాయి. అభివృద్ధి, సంక్షేమనికి సంబందించి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ప్రజలకు ఇచ్చే ప్రతి హామీపై అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. వీ అన్నవరం తోపాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రధానంగా తాగునీరు, రహదారి మరమ్మతులు, విద్యుత్ సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబందించి వినతి పత్రాలు అందించారు.ఈ కార్యక్రమంలోతహసీల్దార్ రవికుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు కొండ్ర గుంట శ్రీనివాస్ కుమార్, సోసైటీ అధ్యక్షుడు చల్ల శ్రీనివాసరావు,మల్లెల నరసింహారావు,మల్లెల మాధవరావు, చిది రాల భరత్ రెడ్డి,అప్పసాని పుల్లారావు,యం ఇ ఓ పాల్ కెనడి,డిప్యూటీ తాహసీల్దార్ నాగరాజు తోపాటు పలువురు అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.