సాయిపురంలో రీ సర్వే పూర్తి..

సాయిపురంలో రీ సర్వే పూర్తి..
ఉయ్యూరు, ఆంధ్రప్రభ : మండలంలోని సాయి పురం గ్రామంలో ఇటీవల నిర్వహించిన రీ సర్వే కార్యక్రమం పూర్తి కావడంతో మంగళవారం పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేలో ఎక్కడా పొరపాట్లు లేకుండా సర్వే చేసి రైతులకు వెంటనే పాస్ పుస్తకాలు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ప్రవీణ్ తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు వెనిగండ్ల కుటుంబరావు, ఆర్ఐ తదితరులు పాల్గొన్నారు
