అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమం…
9వ డివిజన్‌లో ‘డోర్-టు-డోర్’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్
(పటమట, ఆంధ్రప్రభ) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హతే ప్రామాణికంగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమమ పథకాల ఫలాలను అందిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమట లంక పెద్ద రామాలయం దగ్గర ‘డోర్-టు-డోర్’ టీడీపీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొన్నారు.
స్థానికంగా ఉన్న ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి విపులంగా తెలియజేశారు. ఇదే కార్యక్రమములో స్థానికంగా ఉన్న సగ్గుర్తి రామకృష్ణ తన అనారోగ్యం నిమిత్తం వైద్య ఖర్చుల కొరకు ఆర్థిక సహాయాన్ని అర్థించగా శాసనసభ్యులు అతనికి గద్దె రామమోహన్ తన సొంత నిధుల నుండి రూ.15000 ఆర్థిక సహాయం చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటికి తీసుకువెళ్ళి మరీ అందచేస్తున్నామని చెప్పారు. అర్హతే ప్రామాణీకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందచేయడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో పయనించేలా చేస్తున్నామన్నారు.
వైఎస్సార్‌సీపీ ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చాలా తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. ఈ విషయాలు అన్నీ ప్రజలకు ఈ ‘డోర్-టు-డోర్’ టీడీపీ కార్యక్రమం ద్వారా వివరిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, కాంతిశ్రీ, బొర్రా గాంధీ, షుబ్లీ, ముమ్మనేని ప్రసాద్, చిప్పల సుబ్బారావు, గల్లా రవి, చిలకలపూడి లక్ష్మీ నరసింహ, కెల్లా రమేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
