అమరావతి ఛాంపియన్ షిప్ లో మూలపాడు విద్యార్థుల సత్తా
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీల్లో మూలపాడు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానాల్లో నిలిచి సత్తా చాటారు. మైలవరంలోని ఎల్ బీఆర్ సీఈలో జూలై 28న జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వి.సుధీర్, కె.హర్ష, వర్ధన్, ఎన్.హెచ్.నారాయణ మూర్తి, టి.సాయి వర్ధన్, ఆర్.నిఖిల్, దాస్ రాజ్, ఎన్.కళ్యాణ్, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
వాలీబాల్ లో పి.హర్ష, అమర్నాథ్ ఎంపికయ్యారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను హెచ్ఎం టి.డేవిడ్ రాక్ ఫెల్లర్, పీడీలు ఎస్.కె.రషీద్, ఎస్.కె.మొహమ్మద్ వహీదా బేగం, ఎన్ సీసీ టీచర్ బి.ఆదిలక్ష్మి, ఉపాధ్యాయులు వి.మంజుల, సిహెచ్.మురళీ కృష్ణ రాజు అభినందించారు.

