కుష్టు వ్యాధి నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి

కుష్టు వ్యాధి నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : కుష్టు వ్యాధి నిర్మూలనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని వెలికట్ట గ్రామ సర్పంచ్ బంధు శ్రీనివాస్ తెలిపారు.కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని వెలికట్ట పల్లె దవాఖానాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా పల్లె దవాఖానాలో మొబైల్ హ్యాండిల్ ఎక్స్ రే యంత్రాన్ని ప్రారంభించారు.ఈ మిషన్ ద్వారా 32 మందికి పరీక్షలు నిర్వహించారు.సిహెచ్ఓ కుసుమ విద్యాసాగర్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ చెప్యాల వనాకర్ రెడ్డితో కలిసి సర్పంచ్ మాట్లాడారు.

కుష్టు వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా అంగవైకల్యానికి దారి తీస్తుందని, ముందుగానే గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా అరికట్టడం సులువు అవుతుందన్నారు. కుష్టు వ్యాధి అరికట్టడం చాలా సులువుగా మారినా వ్యాధిగ్రస్తులపై ప్రజల్లో, కుటుంబ సభ్యుల్లో వారిపై చిన్నచూపు కనిపిస్తుందన్నారు. లెప్రసీ వ్యాధిని ఎండిటి ద్వారా నివారించవచ్చన్నారు.

వ్యాధిగ్రస్తులకు శరీరం పాలిపోయి రాగి రంగు మచ్చలు, స్పర్శ లేకపోవడం, పాదాలు, చేతివేళ్లు తిమ్మి ర్లు వంటి లక్షణాలుంటాయన్నారు. బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధిని అరికట్టువచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫరా ఫాతిమా, ఆరోగ్య సిబ్బంది జిలుకర రమేష్, జ్యోతి, సందీప్, జితేందర్, హేమంత్ నాయక్, స్థానికులు మహబూబ్, మాధవి, చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply