తెలంగాణ ఉద్యమంలో సిపిఐ ది కీలకపాత్ర

తెలంగాణ ఉద్యమంలో సిపిఐ ది కీలకపాత్ర
- సిపిఐ మండల నాయకుడు మంద భాస్కర్
కేసముద్రం, ఆంధ్రప్రభ : మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో సిపిఐ కీలక పాత్ర పోషించిందని సిపిఐ మండల నాయకుడు మంద భాస్కర్ అన్నారు. సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రం లో ప్రకటన విడుదల చేస్తూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, సిపిఐ నాయకత్వనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడమే కాకుండా, 4,500 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. 2000 సంవత్సరం వరంగల్ లో జరిగిన సిపిఐ బహిరంగ సభలో తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సిపిఐ డిక్లరేషన్ చేసిందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ నుంచి గల్లి వరకు ఒకే మాట ఒకే బాటగా సిపిఐ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానా నిలబడి అనేక ఉద్యమాలు, అనేక కేసులను ఎదుర్కొన్నదని అన్నారు. జాతీయస్థాయిలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని సిపిఐ తీర్మానం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలైనా నేటికీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఎన్నికల హామీలో భాగమైన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
