goldabove150000 |తస్మాత్ జాగ్రత్త.. దొంగల కన్ను మీ ఇంటిపైనే!

goldabove150000 |తస్మాత్ జాగ్రత్త.. దొంగల కన్ను మీ ఇంటిపైనే!
goldabove150000 | తాళం వేసిన ఇళ్లే దొంగల టార్గెట్…పోచారం సీఐ కనకయ్య గౌడ్ హెచ్చరిక
బంగారం ధర లక్షన్నర.. దొంగల కన్ను పసిడిపైనే
ఇల్లు గుల్ల కాకుండా ఉండాలంటే.. మీ గేటు వద్ద సీసీ కెమెరాలు ఉండాల్సింది
వేసవి ప్రయాణం.. దొంగలకు వరం
అద్దెకు ఇల్లు కావాలని వస్తున్నారా? అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి
నేరగాళ్ల గురి.. మీ ఇంటి తాళం పైనే! సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
పక్కింటి వారే మీ పహారా.. పోలీసుల ‘సేఫ్ హోమ్’ మంత్రం ఇదే!
ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : ఎండలు మండిపోతున్నాయి.. పిల్లలకు సెలవులు రావడంతో నగరాలన్నీ ఖాళీ అవుతున్నాయి. తమ సొంత ఊర్లకు, తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే, మీ ప్రయాణ ఆనందం తిరిగి వచ్చేసరికి ఆవిరి కాకూడదంటే మీ ఇంటి భద్రత విషయంలో రాజీ పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు మాటు వేస్తున్నారని ప్రతి ఒక్కరు పలు జాగ్రత్తలు పాటించాలని పోచారం ఐటిసి పోలీస్ స్టేషన్ సీఐ కనకయ్య గౌడ్ సూచించారు.
పసిడిపైనే దొంగల కన్ను..
ప్రస్తుతం మార్కెట్‌లో తులం బంగారం ధర రూ. 1,50,000 మార్కును తాకడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సొత్తును దోచుకోవడానికి పక్కా ప్లాన్తో దొంగతనాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లు, గేటెడ్ కమ్యూనిటీలను కూడా వదలకుండా రెక్కీ నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
పోలీసుల సేఫ్ హోమ్ సూత్రాలు..
విలువైన వస్తువులను ఇంట్లో ఉంచొద్దు మీ ఇంట్లో నగదు లేదా బంగారం ఉంటే, అది దొంగలకు ఆహ్వానం పలికినట్లే అని సీఐ పేర్కొన్నారు. వారం రోజుల కంటే ఎక్కువ కాలం ప్రయాణంలో ఉంటే, ఆ వస్తువులను బ్యాంకు లాకర్లలో గానీ లేదా మీ నమ్మకమైన బంధువుల వద్ద గానీ ఉంచడం ఉత్తమం.

ప్రతి ఇంటి యజమాని తమ ఇంటి వద్ద ఐపి ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ మొబైల్ ద్వారా ఇంటి పరిసరాలను గమనించవచ్చు. ఇంటి ముందు భాగంలోనే కాకుండా, వెనుక వైపు దారుల వద్ద కూడా కెమెరాలు ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మీరు వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు, ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళను పక్షాన ఈ నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వగలరు 8712662718(పోచారం పోలీస్ స్టేషన్ నంబర్) దీనివల్ల పోలీసులు మీ వీధిలో రాత్రిపూట గస్తీని పెంచుతారు (బ్లూ కోల్ట్స్ /పెట్రోలింగ్). అలాగే, మీ ప్రయాణ విశేషాలను సోషల్ మీడియా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయకండి. ఇది మీరు ఇంట్లో లేరని దొంగలకు సులభంగా సంకేతం పంపినట్లవుతుంది.
కొత్త తరహా నేరాలు – తస్మాత్ జాగ్రత్త!
ఇల్లు అద్దెకు కావాలని వచ్చే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీరు అద్దె సాకుతో ఇంట్లోకి వచ్చి, లోపల ఉన్న భద్రతా ఏర్పాట్లను, లాకర్ల పరిస్థితిని గమనిస్తుంటారు, అపరిచితులు వచ్చినప్పుడు మహిళలు ఒంటరిగా ఉన్నట్లయితే తలుపులు తీయకూడదు. బయట వ్యక్తులకు మీ ఆర్థిక విషయాలను, మీరు ఎప్పుడు ఊరికి వెళ్తున్నారో చెప్పకూడదు. రాత్రి వేళల్లో ఇంటి ముందు లైట్లు వెలిగించి ఉంచాలి. స్మార్ట్ బల్బులు వాడితే రాత్రి వేళ ఆటోమేటిక్‌గా అవి వెలిగేలా సెట్ చేసుకోవచ్చు.
ప్రయాణాల్లో మహిళలకు హెచ్చరిక..
రోడ్లపై నడిచేటప్పుడు లేదా బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు మెడలో గొలుసులు బయటకు కనిపించకుండా జాగ్రత్త పడాలి. బైక్‌లపై వచ్చే దొంగలు క్షణాల్లో గొలుసు లాక్కెళ్లే ప్రమాదం ఉంది. నేర రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలి. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 కి లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్‌కు ఫోన్ చేయండి అని పోచారం సీఐ కనకయ్య గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మీ ఇరుగుపొరుగు వారికి మీరు ఊరికి వెళ్తున్నట్లు సమాచారం ఇవ్వండి. మీ ఇంటి ముందు వార్తా పత్రికలు (Newspapers), పాల ప్యాకెట్లు పోగు పడకుండా చూడమని వారికి చెప్పండి. ఎందుకంటే వాకిలిలో పేపర్లు పోగుపడి ఉంటే ఆ ఇంట్లో ఎవరూ లేరని దొంగలు సులభంగా గుర్తిస్తారు.

click here to read 100%increasing | యువతను మింగేస్తున్న డ్రగ్స్ మాఫియా
