విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి…

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి…

దుర్గి, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్ తగిలి ఓవ్యక్తి గురువారం మృతి చెందారు. వివరాల ప్రకారం దుర్గి మండలం, పోలేపల్లి గ్రామంలోని పొలంలో ఈ సంఘటన జరిగింది. పోలేపల్లి గ్రామానికి చెందిన బాలబోయిన శంకర్ వయస్సు 52సం. లు త డ్రి నాసరయ్య.శంకర్ కొండసాని వెంకట రామిరెడ్డి పొలంలో ట్రాన్స్ ఫారం బిగించటానికి ప్రయత్నం చేశాడు.

వైర్ ను పట్టుకొని లాగ‌టానికి ప్ర‌య‌త్నించే క్ర‌మంలో కరెంట్ వైర్ కు తగిలి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందినట్లు స్థానిక ఎస్సై లేళ్ళ సుధీర్ కుమార్ విలేకరులకు సమాచారం ఇచ్చారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply