పెళ్లాడిన ప్రేమికురాలిని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
పెళ్లాడిన ప్రేమికురాలిని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
- మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్య
మునగాల, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఆకుపాముల గ్రామానికి చెందిన సటు కోటేశ్వరరావు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి ఇటీవల వివాహం చేసుకున్నాడు. అయితే వారి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించకపోవడంతో ప్రేమికుల జంట ఇల్లు విడిచి వెళ్లి వేరే చోట నివసిస్తున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు వారి ఆచూకీ తెలుసుకుని ఆదివారం తమ కుమార్తెను తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో తాను ప్రేమించి వివాహం చేసుకున్న యువతి దూరమైందనే మనస్తాపానికి గురైన కోటేశ్వరరావు సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
