ఉపాధి పనులు ప్రారంభం

ఉపాధి పనులు ప్రారంభం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని దిల్ దార్ నగర్ గ్రామంలో సోమవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. దిల్దార్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఉపాధి కూలీలు, ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆనంద్ గౌడ్, వీడీసీ అధ్యక్షులు కొండాడి జగ్గారావు, జిపి వార్డు సభ్యులు, స్థానిక ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ వసంత శ్రీనివాస్, కారోబారిచారి, ఉపాధి కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply