accident | ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్

accident | ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్

accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని బుగ్గబావిగూడెం గ్రామంలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన మినీ కంటైనర్ నేరుగా ఓ నివాస గృహంలోకి దూసుకెళ్లడంతో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల వివరాల ప్రకారం, వేగంగా వెళ్తున్న మినీ కంటైనర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న వెంకన్నపైకి వాహనం ఎక్కడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా, గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం సమయంలో ఇంట్లో మరెవరూ లేకపోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.