అభివృద్థిపై అవగాహన లేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి..
అభివృద్థిపై అవగాహన లేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి..
ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన, అవగాహనలేని ఏౖకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రజాదర్బార్ కార్యాక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తే మానవాళి అల్లాడిపోతుందన్నారు. అందువల్ల ప్రకృతిని కాపాడటానికి తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రకృతిని ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేదన్నారు.

తమ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో లక్షలాది మందికి ఫించన్లు ఇవ్వనున్నామని, తమ ప్రభుత్వం ఆ ప్రక్రియలో ఉందని వెల్లడించారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈ ఫించన్లు మంజూరు చేయనున్నామని చెప్పారు. ఇంటి స్థలాలను కూటమి ప్రభుత్వం త్వరలో మంజూరు చేయనుందని తెలిపారు. అంగన్‌వాడీ స్కూల్‌లో టీచర్లు, ఆయాలకు 17 మందికి నియామక పత్రాలను అందచేశామని చెప్పారు. ఒక వైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందిస్తున్నారని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేంద్రం నుంచి సహకారం తీసుకోకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలను రాష్ట్రం నష్టపోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనకున్న సమర్థతతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రం నుంచి పది శాతం వాటా భరిస్తే కేంద్రం 90 శాతం నిదులు ఇస్తోందని ఆ పది శాతం నిధులు కేటాయించకుండా 90 శాతం నిధులను వదులుకున్న ఘోరమైన ప్రభుత్వం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్థి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మనమందరం అండగా ఉండి మరింత శక్తిని ఇవ్వాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఈ కార్యక్రమములో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, డివిజన్ ఇంఛర్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
