బిజ్వార్ అంబాత్రయ క్షేత్రంలో గోమాత కళ్యాణం

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గోమాత కళ్యాణం తిలకించి పునీతులుకావాలని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గోమాత కళ్యాణం విజయవంతం చేయాలని బిజ్వార్ అంబాత్త్రయ క్షేత్రం వ్యవస్థాపకులుశ్రీ డాక్టర్ ఆదిత్య పరవశ్రీ స్వామీజీ పిలుపునిచ్చారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ అంబాత్రయ క్షేత్రంలో గోమాత కళ్యాణం గోడపత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని గోమాతను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని అన్నారు.
ప్రతి ఏడాది అంబాత్రాయ క్షేత్రంలో గోమాత కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత దైవచింతన అలవర్చుకోవడంతోపాటు నిత్యం దేవాలయాల్లో ఇళ్లల్లో ధూపదీప నైవేద్యాలు చేపట్టడం వల్ల ప్రజలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉంటారనిఅన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి దైవభక్తి పెంపొందించుకోవడంతోపాటు సేవా దానగుణం అలవర్చుకోవాలనిఅన్నారు.
ఈ నెల 12న ఆదివారం ఉదయం11:28 గంటలకు వధువు రేణుక ఎల్లమ్మ తల్లి, వరుడు శ్రీ జమదగ్ని కళ్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గోమాత కళ్యాణానికి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయడంతో పాటు శ్రీ అంబా భవాని మాత, గోమాత ఆశీర్వాదాలు పొందాలని కోరారు. గోమాత కళ్యాణానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నట్లుతెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి పీఠం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
