పేద కుటుంబాలకు అండగా నిలవాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని యాదవ చైతన్య వేదిక మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బత్తుల యాకయ్య కోరారు.మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన సింగారపు బుచ్చమ్మ, గొల్లపల్లి మల్లయ్య లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.గ్రామానికి చెందిన యాదవ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు బత్తుల యాకయ్య సోమవారం సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల చొప్పున క్వింటా బియ్యాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా యాకయ్య మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు. గ్రామంలో ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు యాసారపు సోమయ్య,నక్క ఐలయ్య,స్థానికులు, కుటుంబ సభ్యులు సింగారపు వెంకన్న, సైదులు,గొల్లపల్లి యాకయ్య, గొల్లపల్లి ఎల్లయ్య, ఉప్పలయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
