4Death | పడవ బోల్తా..

4Death | పడవ బోల్తా..

నలుగురు దుర్మరణం
వీరలో ముగ్గురు చిన్నారులు

సరదాగా లంకకు వెళ్లి..
తిరిగి రాని లోకాలకు…
కృష్ణమ్మ ఒడిలో తీరని శోకం
కోనూరు కన్నీరు మున్నీరు
పల్నాడులొ ఘోర విషాదం

4Death | ప‌ల్నాడు ప్ర‌తినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గo, అచ్చంపేట మండలం, కోనూరు గ్రామంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సరదాగా పడవపై లంకకు వెళ్తున్న 10 మంది బంధువులు ప్రమాదానికి గురయ్యారు. పడవ ఒక్కసారిగా తిరగబడటంతో నలుగురు గల్లంతయ్యారు. వారిలో కార్తీక్ (12), గంధం సంధ్య (9), గంధం సైని (11), కొనతం చైతన్య (28) ఉన్నారు. మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు.

4Death |
4Death |

4Death | ఒకే కుటుంబ సభ్యులు

కాగా మరో ఆరుగురిని స్థానికులు క్షేమంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా చెబుతున్నారు. సమాచారం అందుకున్న అచ్చంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలూరు శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి హుటా, హుటిన చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కోనూరు గ్రామంలో జరిగిన ఒక ఫంక్షన్ కు వీరందరూ హాజరైనట్లు బంధువులు పేర్కొన్నారు.

4Death |

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంటి కార్యక్రమానికి వచ్చిన 10 మంది సరదాగా నదిలో చిన్న పడవలో విహార యాత్రకు వెళ్లగా, తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడటంతో ప్రమాదం సంభవించింది.

4Death |

ఈ ఘటనలో పడవలో ఉన్న 10 మంది నీటిలో మునిగిపోయారు. గ్రామస్తులు సాహసోపేతంగా స్పందించి ఆరుగురిని సురక్షితంగా కాపాడగా, మరో నలుగురు గల్లంతైనట్లు సమాచారం.

4Death |
4Death |

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో కలిసి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

4people |

click here to read more : 108Ambulance | ఎక్సెల్ సూపర్‌ను ఢీకొన్న గ్లామర్ బైక్

click here to read more :

Leave a Reply