షిర్డీ, ఆంధ్రప్రభ : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీ సాయిబాబా సమాధిని సందర్శించారు. దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమ్‌రాజ్ దారాడే ఆయనను సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో షిర్డీ ఎంపీ భౌసాహెబ్ వక్చౌరే, పౌరసంబంధాల అధికారి తుషార్ షెల్కే, ఆలయ పర్యవేక్షకుడు రాజేంద్ర పవార్, తదితరులు పాల్గొన్నారు.
