108Ambulance | ఎక్సెల్ సూపర్‌ను ఢీకొన్న గ్లామర్ బైక్

108Ambulance | ఎక్సెల్ సూపర్‌ను ఢీకొన్న గ్లామర్ బైక్

ఒకరి పరిస్థితి విషమం.. తిరువూరు ఆస్పత్రికి తరలింపు

108Ambulance | ఏ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్లామర్ మోటార్‌సైకిల్, ఎక్సెల్ సూపర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎక్సెల్ సూపర్‌పై ప్రయాణిస్తున్న పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన కొమ్ము రవిబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Leave a Reply