రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి

రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి

ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ సదస్సు, కార్యశాల

ఘంటసాల, ఆంధ్రప్రభ: రైతాంగ సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పార్థసారథి పేర్కొన్నారు.

గురువారం ఘంటసాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ సదస్సు, కార్యశాల నిర్వహించారు.

కార్యక్రమాన్ని తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. రసాయనిక ఎరువులతో పండించే పంటల వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతో అధిక దిగుబడి సాధ్యమవుతుందని వివరించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి రెండుసార్లు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో డీడీఏ ఏ. నాగభూషణరావు, కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి. సుధారాణి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సొంటి అయ్యప్ప, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షురాలు బి. శ్రీలక్ష్మి, బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మట్టా ప్రసాద్, కవులూరు రైతుల రాష్ట్ర కన్వీనర్ జీవీ నగరాయులు, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, బీజేపీ నియోజకవర్గ నాయకుడు కొండవీటి రామకృష్ణ, ఏవో అనూష, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.