రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

డెంకాడ(విజయనగరం), ఆంధ్రప్రభ : మండలం లోని అయినాడ జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు అందించిన వివరాలు ప్రకారం మక్కువ మండలం ఏ. వెంకంపేట గ్రామానికి చెందిన తాన్న హర్ష చైతన్య, సీతానగరం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన రెడ్డి ఉదయ్ సాయి.. ఇద్దరూ వివాహ వేడుకలకు హాజరై బైక్ పై తిరుగు ప్రయాణంలో అయినాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన చెందినట్లు తెలుస్తోంది. డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.