కారు అదుపుతప్పడంతో..

కారు అదుపుతప్పడంతో..

ఇటిక్యాల, ఆంధ్రప్రభ : 44వ జాతీయ రహదారి పై కారు అదుపుతప్పి బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి కారులో తిరుపతి వెళుతుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పదవ బెటాలియన్ హెచ్ పి పెట్రోల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 44 జాతీయ రహదారి పై ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పింది.

ఈ కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఒకరు సుభద్ర. ఆమె వయసు దాదాపు 55 సంవత్సరాలు. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరు పల్దీర్, రిహానులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇటిక్యాల పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పటల్ కి హైవే అంబులెన్స్ ద్వారా తరలించినట్లు తెలిపారు.