ఈ నెల 11 నుంచి వైభవంగా శ్రీ హనుమాన్ జయంతోత్సవాలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మారుతీనగర్ (పాటీగడ్డ)లో వేంచేసియున్న శ్రీ పాటీమీది భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఈ నెల 11, 12 తేదీలలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు.
ముఖ్య కార్యక్రమాలు :
మంగళవారం సాయంత్రం 6 గంటలకు స్వామి వారి శోభాయాత్ర కన్నుల పండువగా సాగనుంది.
అన్నప్రసాద వితరణ : మంగళవారం మధ్యాహ్నం 12:15 నిమిషాలకు పి.బి. గార్డెన్స్, తంగడపల్లి రోడ్ వద్ద భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథులు :

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఇతర ప్రముఖులు పాల్గొంటారు. భక్తులందరూ ఈ జయంతోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధ్యక్షులు సందగళ్ల నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఊడుగు రమేష్ గౌడ్ మరియు అర్చకులు బ్రహ్మశ్రీ పెద్ది సుధాకర్ శర్మ, కిషోర్ శర్మలు కోరారు.
