రాధారంగా మిత్ర మండలి
రాధారంగా మిత్ర మండలి
ముఖ్య అనుచరుడికి ఆర్ధిక సహాయం
పాయకాపురం, ఆంధ్రప్రభ : రాధారంగా మిత్ర మండలి ముఖ్య అనుచరుడికి స్వర్గీయ కళ్ళే లలిత ట్రస్ట్ నుండి ఆర్ధిక సహాయం అందజేశారు. సింగ్ నగర్ కళ్ళే లలిత వారి వీధిలో గల కళ్ళే లలిత ట్రస్ట్ కార్యాలయంలో రాధారంగా మిత్ర మండలి ముఖ్య అనుచరుడు సుభానికి పదివేల రూపాయిల ఆర్ధిక సహాయాన్ని ట్రస్ట్ చైర్మన్ కళ్ళే నాగేశ్వరరావు అందజేశారు.
ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో భాగంగా సుభానికి ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ కళ్ళే నాగేశ్వరరావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చందన సురేష్(మామ),కొప్పుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
