Power House | ఏపీ పీయూసీ సమావేశం

Power House | ఏపీ పీయూసీ సమావేశం

  • హాజ‌రైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

Power House | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధలో ఇవాళ జరిగిన పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కమిటీ (పీయూసీ) సమావేశం జ‌రిగింది. పీయూసీ సభ్యులైన మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై చర్చించారు.

Power House

ఏ.పి. పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజెన్‌కో), ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (ఏపీఎస్‌డబ్ల్యూసీ), ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల (ఏపీఆర్‌డీసీ), వార్షిక నివేదికలు, సాధారణ కార్యకలాపాలను సమీక్షించారు.

Power House

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, పని తీరును, ఖాతాలను, ఆదాయ వ్యయ నివేదికలను, ఆడిట్ సమాచారాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పారదర్శకత, సమర్థత ఉండేలా, అవినీతి, నిర్లక్ష్యం, నష్టాలపై క్లుప్తంగా విచారణ చేసి, ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నట్లు వెల్లడించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల్లో స్వచ్ఛ‌త, సమర్థత, ప్రజాధనం వినియోగంపై సమగ్రంగా విశ్లేషించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సహచర పీయూసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Power House
Power House

Leave a Reply