ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కె. గంగాధర్

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కె. గంగాధర్
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా గురువారం కె గంగాధర్ పదవి బాధ్యతలు చేపట్టారు గత కొన్ని నెలల నుండి కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎఫ్ ఎస్ సి ప్రిన్సిపాల్ గా దిలావర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ కొనసాగుతున్నారు కాగా ఇటీవలే ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల పదోన్నతులు కల్పించడంతో జగిత్యాల జిల్లా కోరుట్ల
ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల లలో బాటని లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న కే గంగాధర్ ప్రిన్సిపాల్ పదోన్నతి పై కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా రావడం జరిగింది.
కడెం ప్రభుత్వ జూనియర్ ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కే గంగాధర్ ఎఫ్ ఎ సి ప్రిన్సిపాల్ సుదర్శన్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
