దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం: కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

దొడ్డి కొమురయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు.