ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి: చైర్‌పర్సన్ సంధ్యారాణి
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి: చైర్‌పర్సన్ సంధ్యారాణి
క్యాతనపల్లి, ఆంధ్రప్రభ:
ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 15వ వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. ఈ సభల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ డా. గోడిసెల సంధ్యారాణి పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా, సకాలంలో అందేలా చూడాలని పేర్కొన్నారు. వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి వినతిని పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ సంధ్యారాణి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, వైస్ చైర్‌పర్సన్ మిట్టపల్లి సరిత-శ్రీనివాస్, 1వ వార్డు కౌన్సిలర్ కౌడగొని సాంబయ్య, 2వ వార్డు కౌన్సిలర్ పుల్లూరి తిరుమల-కళ్యాణ్, 15వ వార్డు కౌన్సిలర్ అర్నె సంధ్యారాణి-సతీష్, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
