పిచ్చి కుక్క దాడిలో పది మందికి తీవ్రగాయలు

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ పరిధిలో నీ పలు కాలనిలలో ఓ పిచ్చికుక్క ఇవ్వాళ ఉదయం సుమారు చిన్న, పెద్ద తేడాలేకుండా పదిమంది పై పడి తీవ్రగాయల పాలు చేసింది. పట్టణంలోనీ పెద్దవాడ, నల్లగొండ పోచమ్మ వాడ, ఇందిరా నగర్ కాలనిలో పిచ్చి కుక్క కనిపించిన వారిపై దాడిచేసి కరిచింది, కుక్క దాడికి గురైన బాధితులు స్థానిక ఆసుపత్రి లో చకిత్స పొందుతున్నారు. గాయపడినవారి లో చిన్న పిల్లలు తీవ్ర గాయాలయ్యాయి.
