రోడ్డు భద్రత నియమాలు పాటించాలి…
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి…
సి ఐ కిరణ్
బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : రహదారి ప్రమాదాలు అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సి ఐ కిరణ్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో వాహనదారులకు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారి ప్రమాదంలో వేలాది మంది మరణిస్తూ తమ కుటుంబాలను తీరని శోకాన్ని మిగులుస్తున్నారని అన్నారు.
ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరిస్తూ ప్రయాణించాలని, బిచ్చగా వాహనానికి సంబంధించి ఆర్ సి, లైసెన్సు, ఇన్సూరెన్స్ పేపర్లు దగ్గర ఉంచుకోవాలని రహదారి నిబంధనలను పాటించాలని, ఈనెల 16వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సి ఐ తెలిపారు. సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ వెంకటేష్ గౌడ్ అన్నారు. ఈకార్యక్రమంలో ప్రజలు,ఆయా శాఖ ల సిబ్బంది పాల్గొన్నారు.
