Explosion | 20మంది గల్లంతు
Explosion | 20మంది గల్లంతు
Explosion | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలోని హల్మాహెరా ఐలాండ్‌లో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతం ఇవాళ ఉదయం విస్ఫోటనం చెందింది. ఈ ఘటనతో పర్వతారోహణకు వెళ్లిన 20మంది గల్లంతయ్యారు. వారిలో సింగపూర్‌కు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. విస్ఫోటనం సమయంలో పర్వత ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులు ఒక్కసారిగా ప్రమాదంలో చిక్కుకున్నారు. గల్లంతైన వారిలో 9మంది సింగపూర్ పర్యాటకులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ఘటనపై ఇండోనేషియా ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించింది. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
