34,739issues | లక్ష్యాల దిశగా పల్నాడు

34,739issues | లక్ష్యాల దిశగా పల్నాడు

34,739issues | కలెక్టర్ల సమీక్ష తర్వాత వేగం పుంజుకున్న అభివృద్ధి
డాక్టర్‌ కృతికా శుక్లా నాయకత్వంలో లక్ష్యాల ఆధారిత పాలన
సాగునీటి ప్రాజెక్టులు, కాలువల పనులకు ప్రాధాన్యం
రహదారుల మరమ్మతులు, గ్రామీణ మౌలిక వసతుల మెరుగుదల
రియల్‌టైమ్‌ మానిటరింగ్‌తో పారదర్శక పరిపాలన
80 శాతం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
జలధార-జలహారతితో భూగర్భ జలాల పెంపు
పర్యాటకాభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు

34,739issues | పల్నాడు, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల సమీక్షా సమావేశం పల్నాడు జిల్లా పాలనా యంత్రాంగంలో నూతన శకాన్ని ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన ఆ కీలక భేటీ- అనంతరం జిల్లాలో స్తబ్దత వీడి, అభివృద్ధి పనులు శరవేగంగా పట్టాలెక్కాయి. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాల ఆధారిత పనితీరు మంత్రాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా నాయకత్వంలోని యంత్రాంగం తూచా తప్పకుండా అమలు చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి సంక్షేమ పథకాల పంపిణీ వరకు ప్రతి అంశంలోనూ పల్నాడు ఇప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. అంకెల్లోనే కాకుండా, సామాన్యుడి ముంగిట మార్పు తీసుకురావడమే ధ్యేయంగా జిల్లా యంత్రాగం పరుగులు పెడుతోంది.

జిల్లా యంత్రాంగం ప్రధానంగా పనుల అమలు, పర్యవేక్షణ, సాంకేతికతపై సూత్రాలపై దృష్టి సారించింది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిలిచిపోయిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా కాలువల పూడికతీత, చివరి ఆయకట్టు-కు నీరందించే పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ శాఖల ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు ముమ్మరమయ్యాయి.

ప్రభుత్వ సేవలలో పారదర్శకత కోసం రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సాప్ట్‌nవేర్‌లను వినియోగిస్తూ, ఫైళ్ల కదలికలో జాప్యాన్ని తగ్గిస్తున్నారు. కలెక్టర్ల సమావేశం తర్వాత జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలు పెరిగాయి. ఉన్నతాధికారులు స్వయంగా గ్రామాలను సందర్శిస్తూ లబ్ధిదారుల సమస్యలను తెలుసుకుంటు-న్నారు. సీఎం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను చేరుకోవడమే మా ప్రాధాన్యత. అంకెల పరంగానే కాకుండా, ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటు-న్న జిల్లా యంత్రాంగం తెలిపారు.

80శాతం ఫిర్యాదుల పరిష్కారం..
ప్రభుత్వ విభాగానికి సంబంధించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తాజా నివేదిక ప్రకారం, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి మొత్తం 42,971 ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రదర్శిస్తున్న వేగం కొత్త పుంతలు తొక్కుతోంది. మొత్తం ఫిర్యాదులలో అత్యధికంగా 34,739 సమస్యలను అధికారులు పరిష్కరించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన జలధార జలహారతి కార్యక్రమానికి అనుగుణంగా పల్నాడు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా జిల్లా యంత్రాంగం, భూగర్భ జల శాఖ, డిబ్ల్యూఎంఏ, భూగర్బ శాఖలా ఆధ్వర్యంలో జిల్లాలో భూగర్భ జలాల పెంపు కోసం సమగ్ర నీటి భద్రత చర్యలను వేగవంతం చేశారు.పల్నాడు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది… జిల్లా పర్యాటక అభివృద్ధి చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్ల ఆధ్వర్యంలో అనేక అభివృద్ది పనులకు ప్రణాళికలు సిద్దం చేశారు.

CLICK HERE TO READ ప్రగతి పథంలో తిరుపతి

CLICK HERE TO READ MORE

Leave a Reply