214purchasingcenters | అభివృద్ధి, పరిపాలనలో వేగవంతమైన చర్యలు

214purchasingcenters | అభివృద్ధి, పరిపాలనలో వేగవంతమైన చర్యలు

214purchasingcenters | పిడిఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు
పరిశ్రమల ఏర్పాటుకు స్థలాల ఎంపిక
కాకినాడ విమానాశ్రయం నిర్మాణానికి ప్రతిపాదనలు
జనగణన ప్రక్రియ ప్రతిష్టాత్మకంగా నిర్వహణ
భూసేకరణ అడ్డంకుల అధిగమింపు
ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షల విజయవంతమైన నిర్వహణ
సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
రబీ ధాన్యం కొనుగోలుకు 214 కేంద్రాల ఏర్పాటు

214purchasingcenters | కాకినాడ, ఆంధ్రప్రభ బ్యూరో : కాకినాడ జిల్లాలో గత నాలుగు మాసాల్లో పిడిఎస్‌ బియ్యం అక్రమ రవాణాను ప్రభుత్వం సమర్ధవంతంగా అరికట్టింది. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు తగిన స్థలాల్ని ఎంపిక చేయడంతో పాటు ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. తాజాగా కాకినాడ విమానాశ్రయం నిర్మాణానికి తుని-అన్నవరం మధ్య స్థలాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి సూచించింది.

జిల్లాలో జనగణన ప్రతిష్టాత్మకంగా సాగుతోంది. వివిధ అభివృద్ది పనుల కోసం చేపడుతున్న భూసేకరణలో అడ్డంకుల్ని అధిగమించే చర్యలు విజయవంతమయ్యాయి. ఎ స్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షల్ని సమర్ధవంతంగా నిర్వహించారు. గతంలో కంటే మెరుగైన ఫలితాల్ని సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే పది విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే రబీ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సకాలంలో సమాయత్తమైంది. 214కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసింది.

CLICK HERE TO READ లక్ష్యాల దిశగా పల్నాడు

CLICK HERE TO READ MORE