Exit Polls | 200 సీట్లు గెలుస్తాం…

Exit Polls | 200 సీట్లు గెలుస్తాం…
Exit Polls | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎగ్జిట్ పోల్స్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయడానికే తప్పుడు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశారని ఆరోపించారు. తమ పార్టీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
టీఎంసీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మమతా బెనర్జీ, ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల తీర్పు వేరుగా ఉంటుందని, తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ వస్తుందని ఆమె అన్నారు.
ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో ఎక్కువ శాతం సర్వేలు పశ్చిమ బెంగాల్‌లో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి. దీనిపై స్పందించిన మమతా, ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలేనని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అసలు నిజం బయటపడుతుందని, ప్రజలు మరోసారి టీఎంసీకే మద్దతు ఇస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
