మిల్లుల్లో ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి

మిల్లుల్లో ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి

  • జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

మోత్కూర్, ఆంధ్రప్రభ ; యాసంగి సీజన్ కి సంబంధించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుండి వాహనాల్లో వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్లు త్వరితగతిన దిగుమతి చేసేందుకు సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని భువనగిరి రోడ్డు లో గల పరమేశ్వర రైస్ మిల్లును క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మిల్లు యజమానితో మాట్లాడారు.ఈ సీజన్ లో రైతులు అధికంగా ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే ధాన్యం వేగవంతంగా ఎప్పటికప్పుడు అన్లోడ్ చేయాలని సూచించారు.తాలు, చెత్త పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నారు.

ధాన్యం లోడ్ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో దిగుమతి విషయంలో ఆలస్యం చేయవద్దని సూచించారు. ఏ రోజుకారోజు ధాన్యాన్ని దిగుమతి చేసుకొని కొనుగోళ్లు వేగవంతం అయ్యేందుకు మిల్లర్లు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జేసీ వెంట జిల్లా సివిల్ సప్లై అధికారిణి రోజారమని, డిప్యూటీ తహశీల్దార్ నర్సింగ్ రావ్,ఎం ఆర్ ఐ సుమన్,జి పి ఓ జగన్ లు ఉన్నారు.