పేకాట స్థావరంపై పోలీసుల దాడి..
పేకాట స్థావరంపై పోలీసుల దాడి..
తొమ్మిది మంది అరెస్ట్.. రూ.6 వేల నగదు, నాలుగు బైకులు స్వాధీనం
చిన్నగూడూరు, ఆంధ్రప్రభ : మండలంలోని జయ్యారం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్సై కుశకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారైనట్లు ఎస్సై తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.6,000 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, నాలుగు స్మార్ట్ఫోన్లు, రెండు కీప్యాడ్ మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిందితులపై జూద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కుశకుమార్ వెల్లడించారు. మండలంలో జూదం, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కుశకుమార్ హెచ్చరించారు
