పొలంలో పాఠాలు

కొనసాముందర్ విద్యార్థులకు ప్రత్యక్ష వ్యవసాయ శిక్షణ

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : “చేతిలో పుస్తకం–పొలంలో అనుభవం” అనే భావనతో వ్యవసాయ విద్యలో భాగంగా కమ్మర్‌పల్లి మండలం జెడ్పీ ఉన్నత పాఠశాల, కొనసాముందర్ విద్యార్థులను శుక్రవారం పంట పొలాలకు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వ్యవసాయ ఉపాధ్యాయుడు సునుగురు హరీష్ వరి సాగు పద్ధతులు, పంటల యాజమాన్యం, ఎరువుల వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి గ్రామ రైతులతో కలిసి వరి నారు నాటే పనిలో పాల్గొని ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్రి మధుపాల్, పీఈటీ రమేష్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, గ్రామ రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.