సోషల్ మీడియా ద్వారా వివాహితను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్..
సోషల్ మీడియా ద్వారా వివాహితను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్..
ఫేక్ వీడియోలతో వేధింపులు.
నర్సాపురం, ఆంధ్ర ప్రభ : వివాహితను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని ఆమెను ఫేక్ న్యూడ్ వీడియొ లతో ఇబ్బంది పెడుతున్న కేసులో ముద్దాయిని పట్టణ పోలీసులు శనివారం ఆరెస్టు చేశారు. పట్టణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ కు చెందిన పిర్యాది అయిన వివాహితకు 10 సంవత్సరాలు క్రితం వివాహం అయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం భర్త ఉద్యోగ నిమిత్తం నరసాపురం రుస్తుంబాద నందు ఉంటుండగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం జళిపూర్,టెనె ప్రస్తుతం మురబాద్, రాంచీ, జార్ఖండ్ కు చెందిన దీపక్ కుమార్ పాఠక, తండ్రి అచ్చితనంద పాఠక అను వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఫేక్ న్యూడ్ వీడియోలను సృష్టించి ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులతో బాటు ఆమె పేరు మీద సోషల్ మీడియా నందు నకిలీ అక్కౌంట్స” సృష్టించి, ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టీ బ్లాక్మెయిల్ కు పాడుతున్నట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది అని తెలిపారు. బాధితురాలు ఇచ్చిన పిర్యాదుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు ముమ్మరం చేశారు.
ఈ కేసు ను అత్యంత ప్రతిష్టాత్మకముగా తీసుకొని, ముద్దాయిల పట్టుకొనుటకు ఉన్నత అధికారులు జిల్లా ఎస్పీ నయీం , నరసాపురం డీ ఎస్పీ సుధాకర్ రావు లు సూచనల మేరకు నరసాపురం పట్టణ సి ఐ ఆకుల రఘు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టి ముద్దాయిను పట్టణ పరిధిలోని రుస్తుంబాద వద్దగల కునపరెడ్డి కన్వెన్షన్ సమీపంలో వుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పైన తెలిపిన ముద్దాయిని రిమాండ్ నిమిత్తం నరసాపురం కోర్టునకు తరలించారు . పై కేసును ఛేదించుటలో ప్రతిభ చూపించిన సి ఐ ఆకుల రఘు, ఎస్ ఐ పి ప్రేమ్ రాజు, హెడ్ కానిస్టేబుల్ వేణు (1853), పి సి లు కనక రాజేష్ (803), బి రాజేష్ (2011), సత్య నారాయణ (2457) లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు కోసం సిఫార్సు చేశారు.
