ఉపాధి పనులు ప్రారంభం..
ఉపాధి పనులు ప్రారంభం..
టేకుమట్ల , ఆంధ్రప్రభ : టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి (బి) గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ చెంద్రకళమొగిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ఉపాధి పనులు కీలకమని, గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శి, కుమార్ వార్డు సభ్యులు, కారోబార్, రవి ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు
