car accident | ముగ్గురికి గాయాలు..
వర్షంతో అదుపుతప్పి ప్రమాదం
car accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, వర్షం కారణంగా రహదారి జారుడుగా మారడంతో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురై ఉండొచ్చని భావిస్తున్నారు.
ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉండగా, వారికి గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో వారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
