విద్యార్థులను సన్మానించిన సర్పంచ్..
విద్యార్థులను సన్మానించిన సర్పంచ్..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంకుషాపూర్ గ్రామంలో సర్పంచ్ శ్రీమతి తోట సునీత సాగర్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ మధ్య వెలువడిన 10వ తరగతి ఇంటర్, ఎంపీహెచ్ డబ్ల్యూ ఫలితాలలో గ్రామానికి చెందిన సాద నవ్య (10 వ తరగతి మండల టాపర్) కంచం వైష్ణవి (జిల్లా టాపర్) చిలుక అక్షర (ఎంపీ హెచ్ డబ్ల్యు) మండల టాపర్ గా రావడం మా గ్రామానికి గర్వకారణమని తెలియజేస్తూ వారికి గ్రామస్థుల సమీక్షం లో శాలువాతో సన్మానించి నగదు ప్రోత్సహం క్రింద 1500 /- ల చొప్పున అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలక వర్గ సభ్యులు, ఉప సర్పంచ్ పండుగ మౌనిక, ఐలయ్య ఎనగంటి, రాజేందర్ పండాల, కల్పన, కుమారస్వామి, సాద కవిత, మహేందర్ గుర్రపు, ఎల్లస్వామి నానవేని, కుమారస్వామి గుర్రపు, వనిత సమ్మయ్య, చిలుక రమేష్, ఐరెడ్డి భుమిరెడ్డి, తిప్పిరెడ్డి మహేందర్ రెడ్డి, తెడ్ల కుమారస్వామి, గోస్కుల గట్టయ్య, గుర్రపు మొగిళి, ఒజ్జ ఐలయ్య, బండారి శంకర్, సాద రఘు, తోట భాగ్యలక్ష్మి, మేకల కుమార్, చిలుక రమేష్, అబ్బెన్గులా రమేష్ ,శ్రీకాంథ్ అంతనగిరి రమేష్ సురేందర్, కూకట్ల దేవేందర్, పెంట రమేష్, పెద్దోజు రమణాచారి తదితరులు పాల్గొన్నారు.
