Tamil Cinema | గుండెపోటుతో….
Tamil Cinema | గుండెపోటుతో….
Tamil Cinema | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆకస్మిక గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
1953లో తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లాంకోయిల్‌లో జన్మించిన భాగ్యరాజ్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సినీ జీవితంలో మొత్తం 75కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రాలు, వినోదభరిత కథాంశాలు, విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల ఆదరణ పొందారు.
ఇటీవల తన గురువు భారతిరాజా మరణించగా, ఇప్పుడు ఆయన శిష్యుడు భాగ్యరాజ్ కూడా కన్నుమూయడంతో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
