ఆజాంజాహి మిల్లు కార్మికుడి ఆత్మహత్యాయత్నం..
- భూ కేటాయింపుల వివాదమే కారణమని ఆరోపణలు
హనుమకొండ, ఆంధ్రప్రభ : కార్మికులకు మోసం చేయాలని చూస్తే ప్రాణ త్యాగానికి వెనకాడబోమని ఆజాంజాహి మిల్లు కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం వరంగల్ ఓసిటి ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధుని ప్రయత్నాలను అడ్డగించి తనను అదుపులోకి తీసుకున్నారు. పరిష్కారం కోసం ప్రాణం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని తనకు నచ్చజెప్పేందుకు యత్నించారు. పూర్వం అజంజాహి మిల్లు మూసివేసిన క్రమంలో కార్మికులకు స్థలాలను కేటాయించారు. అట్టి స్థలాలను ఆక్రమించాలని కుట్రపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధ్యత వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఏళ్లు గడుస్తున్న కనీసం కార్మికుల పట్ల కనికరం అధికారులకు కనికరం లేకుండా పోయింది. అతి విలువైన భూములను కార్మికులకు అప్పగించడం ఏంటని దారితప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆజాంజాహి మిల్లు చరిత్రకు కార్మికులే కారణమన్న సంగతి ఓరుగల్లు ప్రాంతానికి తెలిసిన సత్యమది. స్థలాలను గుర్తించి హద్దులు వేసి అప్పగించాల్సిన అధికారులే అడ్డుకోవాలని చూడడం దురదృష్టకరమని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఆత్మహత్యయత్నాలు జరుగుతున్నప్పుడు ఇప్పటికైనా కార్మికుల పక్షాన కరంకరం చూపించి, తమకు కేటాయించబడిన స్థలాలను గుర్తించి అప్పగించాలని కార్మికుల పక్షాన ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
