ఎస్ఐఆర్ ఓటర్ సర్వేకు ప్రజలు సహకరించాలి..
- కల్లెడ సర్పంచ్ టి. రుక్మిణి దేవి
కడెం, ఆంధ్రప్రభ : ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ సర్వేకు ఓటర్లు, ప్రజలు బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని కల్లెడ గ్రామ సర్పంచ్ టి. రుక్మిణి దేవి సంజీవ్ పటేల్ కోరారు.
కడెం మండలంలోని కల్లెడ గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటర్ సర్వేను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వో భాగ్యలక్ష్మితో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు.
ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని నమోదు చేసే ప్రక్రియలో ఆమె భాగస్వామ్యమయ్యారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీపీఓ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి మొయినుద్దీన్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్ అనసూయ, ఓటర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
