పేదలకు ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలి…

పేదలకు ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలి…

సీపీఐ డిమాండ్

నరసరావుపేట, ఆంధ్రప్రభ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేసారు.. సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ మంగళవారం పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు పట్టణంలో పేదలకు 0.02 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 0.03సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. కానీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు.ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా టిడ్కో ఇళ్ళు లబ్దిదారులకు స్వాధీనం చేయాలని అన్నారు.

బాడుగ ఇంట్లో ఉండే పేదవారికి ఇంటి అద్దె చెల్లించాలని అన్నారు. జి.ఓ.ఎం.ఎస్ నెం.23 సడలించాలని అన్నారు. భూ మాఫియాను అరికట్టాలని అన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని, సిపిఐ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

అనంతరం తహశీల్దార్ వేణుకు వినతి పత్రం అందజేశారు. తొలుత పట్టణంలో సిపిఐ కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైదన వెంకట్, ఎఐఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు, సిపిఐ మండల కార్యదర్శి కోయా శ్రీను, మహిళా సమైక్య కార్యదర్శి ఎస్.దేవి, సిపిఐ నాయకులు కాళికా, చాందినీ,స్వాతి,అరుణ్, నాగేశ్వరరావు,పిడెం హుస్సేన్, చిట్యాల శ్రీనివాసరెడ్డి,అబ్రహం, జమ్ములమూడి వెంకటేశ్వర్లు, ముప్పూరి మధుసూదనరావు,ఏశోబు, రాధాకృష్ణ, అంజయ్య,కుమారి , నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply