చిన్నారుల ఆరోగ్య రక్షణకు పోలియో చుక్కలు తప్పనిసరి
- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి…
- బస్తీ దవాఖానాలో ఘనంగా పల్స్ పోలియో..
- ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలి.
- పోలియో రహిత సమాజమే లక్ష్యం.. గుండ్ల పోచంపల్లిలో పోలియో డ్రాప్స్ పంపిణీ..
మేడ్చల్, ఆంధ్రప్రభ : చిన్నారుల ఆరోగ్య రక్షణకు పోలియో చుక్కలు ఎంతో తప్పనిసరి అని మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి అన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని బస్తీ దవాఖానా (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్) లో ఆదివారం రోజు చిన్నపిల్లలకు ఆయన పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా అమరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల్లో అంగవైకల్యం కలగకుండా కాపాడేందుకు జీరో నుండి ఐదు సంవత్సరాల లోపు వయసున్న ప్రతి ఒక్కరికీ రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. చిన్నారుల భవిష్యత్తుకు మంచి భరోసా ఇచ్చే ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని అందరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని పోలియో రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
