గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి,వార్డు సభ్యులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికులు,ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రయాణికులు, కార్మికులు,సాధారణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేసవిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు యాసరాణి దినేష్,పందుల గంగాధర్,పందుల లింగస్వామి,భీమనపల్లి కిరణ్,ఎండి అన్వర్, శ్రీను,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply