పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
- ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవరణలో నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటాలని,పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని,కలుషితం అవుతున్న ప్రకృతిని మొక్కలు నాటి కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిది అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ అశ్రద్ బేగం అన్సారి అల్లి, జై నూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోడసం రాధ బాయి,కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
