ఘటనాస్థలిలో కుటుంబ సభ్యుల ఆందోళన
ఘటనాస్థలిలో కుటుంబ సభ్యుల ఆందోళన
వేమనపల్లి (నీల్వాయి), ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా (Mancherial District) వేమనపల్లి (నీల్వాయి) మండలం అడవుల్లో ఈ రోజు ఉదయం బీజేపీ నాయకుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో నీల్వాయి ఎస్సై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST atrocity case) నమోదు చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మధుకర్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.
ఆయన ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని, అధికారులను సస్పెండ్ చేయాలని వారు ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులతో పాటు సుమారు రెండు వందల మంది చేరుకుని ధర్నా (Dharna) చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి తమకు న్యాయం చేస్తామని ప్రకటించే దాకా మృతదేహాన్ని తరలించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

