ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి

ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి

  • ఎస్సై భూమేష్

జైపూర్, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణకు మండల ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఎస్సై భూమేష్ అన్నారు.ఆయన జైపూర్ మండల నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై భూమేష్ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలు,గంజాయి,జూదం,ట్రాఫిక్ సమస్యలు,మహిళలు, బాలల రక్షణ తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఎల్లవేళలా తాము అందుబాటులో ఉంటామని ప్రజలు పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు. పోలీస్ సిబ్బంది నూతన ఎస్సై భూమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఇదివరకు పనిచేసిన ఎస్సై రాజశేఖర్ చెన్నూర్ కు బదిలీపై వెళ్ళారు.