Engineering college | ఉపకార వేతనాలు..

Engineering college | ఉపకార వేతనాలు..

Engineering college, భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : భీమవరం ఎస్ ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులకు ఏపీరోక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.5 లక్షల రూపాయల ఉపకార వేతనాలు అవార్డు ప్రకటించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఏపిరోక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పంపించిన చెక్కులను ఒక్కొక్క విద్యార్థికి రూ.25 వేల రూపాయలు చొప్పున అందించడం జరిగిందని ఆయన చెప్పారు.

గురువారం కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చెక్కులు పంపిణీ సందర్భంగా కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డీన్ డాక్టర్ కేఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. సి.ఎస్.ఆర్ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థుల ప్రగతికి, సామాజిక అంశాలు పరిగణలోకి తీసుకొని వారిని మరింతగా తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహాయం కూడా అందించేందుకు ఈ ఎంపికను కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ ధనరాజ్ పూర్తి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ తమ కళాశాల విద్యార్థులకు ఇదే విధంగా స్కాలర్షిప్స్ అందిస్తుంది అన్నారు. స్కాలర్షిప్స్ తో పాటు విద్యార్థులకు ప్రొఫెషనల్ మోనిటరింగ్, ఎంప్లాయిబులిటీ స్కిల్స్ అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా స్కాలర్షిప్ అందుకున్న పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఏపిరోక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply